అసెంబ్లీని ముట్టడికి యత్నించిన రైతులు అరెస్ట్

అసెంబ్లీని ముట్టడికి యత్నించిన రైతులు అరెస్ట్

రైతుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. మూసివేసిన చెక్కర ఫ్యాక్టరీలను తిరిగి తెరిపించాలంటూ... అసెంబ్లీ ముట్టడికి యత్నించారు జగిత్యాల రైతులు. మూసివేసిన నిజాం చెక్కర ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. పండించిన చెరుకు పంట ఎక్కడ అమ్ముకోవాలో తెలియటం లేదన్నారు. షుగర్ ఫ్యాక్టరీలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. సర్కార్ వెంటనే స్పందించి మూసివేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అయితే అసెంబ్లీ ముట్టడికి వచ్చిన రైతులను అడ్డుకున్న పోలీసులు...వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సర్కార్ తీరుపై మండిపడ్డారు రైతులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

దేశ చరిత్రలో ఇవాళ బ్లాక్ డే