బషీర్‌బాగ్, వెలుగు: ఇంటర్ సెకండియర్ చదువుతున్న సుమారు 300 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాము యాదవ్, ఉపాధ్యక్షుడు నవీన్ గౌడ్ మాట్లాడుతూ.. అనుమతి లేని కాలేజీలకు అధికారులు కొమ్ముకాస్తూ, అక్కడ చదువుతున్న విద్యార్థుల జీవితాలను రిస్క్‌లో పడేస్తున్నారని ఆరోపించారు.
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తక్షణమే హాల్ టికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో నాంపల్లిలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
