జగిత్యాల రెవెన్యూలో ఎలక్షన్ ఫియర్

జగిత్యాల రెవెన్యూలో ఎలక్షన్ ఫియర్

జగిత్యాల జిల్లా రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో ఆఫీసర్లకు ఎలక్షన్ భయం పట్టుకుందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి ఓట్ల లెక్కింపునకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. అక్కడ  డ్యూటీ చేసిన రెవెన్యూ ఆఫీసర్లకు డిపార్ట్​మెంట్​ పనితోపాటు కోర్టు చుట్టూ తిరుగుడు, ఆదేశాల అమలు, ఎంక్వైరీ తదితర అంశాలతో ఇబ్బంది పడ్డారు. ఒక దశలో జిల్లా ఆఫీసర్లతో చివాట్లు కూడా తిన్నారు. దీంతో అప్పట్లో డ్యూటీ చేసిన ఇద్దరు మండల స్థాయి ఆఫీసర్లలో ఒకరు ప్రమోషన్ పై వెళ్లగా, మరొకరు బదిలీపై వెళ్లి రిలాక్స్ అయ్యారు.

ఎలక్షన్ ప్రొటోకాల్ డ్యూటీ చేసిన ఓ రెవెన్యూ ఆఫీసర్​పై అవినీతి ఆరోపణలు రావడంతో బదిలీ వేటు పడింది. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న కొందరు బదిలీపై బయటపడాలని చూస్తుంటే.. బదిలీ వేటు పడిన ఆఫీసర్ మాత్రం ‘ఐ డోంట్ కేర్’.. ఇక్కడే డ్యూటీ చేస్తానంటూ తెగ ఉత్సాహ పడుతున్నాడట. ఇక్కడే డ్యూటీ ఎక్కుతానంటూ స్థానిక ఎమ్మెల్యేలతో పైరవీ చేయిస్తున్నాడట. పైరవీ తుది దశకు వచ్చిందని, రేపోమాపో వచ్చేస్తున్నానంటూ డిపార్ట్​మెంట్​లో అందరికీ చెప్పుకుంటూ ఆఫీసు చూట్టూ చక్కర్లు కొడుతున్నాడట. 
‑ జగిత్యాల, వెలుగు