
దాదాపు 37 ఏళ్ల తర్వాత దేశంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదంగా నేడు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన క్రాష్ నిలిచింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన 274 మందిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎంఎస్సీ పూర్తి చేసిన 23 ఏళ్ల క్రికెటర్ దిర్ధ్ పటేల్ కూడా ఉన్నాడు. బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాల సముదాయానికి చెందిన AI 171 గురువారం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొన్ని సెకన్లకే కూలిపోయింది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎత్తును కోల్పోయిందని అధికారులు తెలిపారు.
అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్తున్న విమానం కూలిపోయినప్పుడు మరణించిన 241 మంది ప్రయాణికులు మరియు సిబ్బందిలో దిర్ధ్ పటేల్ ఒకరు. "నిన్న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో లీడ్స్ మోడరన్నియన్స్ CCకి చెందిన దిర్ధ్ పటేల్ మరణించిన వార్త తెలిసి లీగ్ చాలా బాధగా ఉంది. అతను గతంలో పూల్ CCకి చెందిన కృతిక్ పటేల్ సోదరుడు" అని లీగ్ తెలిపింది.
"2024లో దిర్ధ్ లీడ్స్ మోడరన్నియన్స్ CC తరపున విదేశీ ఆటగాడు. 20 మ్యాచ్‌ల్లో 312 పరుగులతో పాటు 29 వికెట్లు పడగొట్టాడు. ఓ వైపు క్రికెట్ ఆడుతూనే తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. కొత్త ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత ఓవర్సీస్ బోర్న్ ఇంగ్లీష్ రెసిడెంట్ ఆటగాడిగా నమోదు చేసుకోవాలనేది అతని ఉద్దేశ్యం.దిర్ధ్ పటేల్ హడర్స్‌ఫీల్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుని కృత్రిమ మేధస్సులో MSc పూర్తి చేశాడు. మెుత్తం 242 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో దాదాపు 171 మందికి పైగా ప్రయాణికులు మృతి చెంది ఉంటారని ప్రస్తుతానికి ఉన్న సమాచారం. అయితే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.