
44 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన సీపీఎం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి ఎండీ జహంగీర్‌ను సీపీఎం బరిలో నిలిపింది. దేశవ్యాప్తంగా 44 మంది ఎంపీ అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను శనివారం ప్రకటించింది. ఇందులో భువనగిరి నుంచి జహంగీర్‌తో పాటు ఏపీలోని అరకు స్థానాన్ని పాచిపెంట అప్పలనరసకు కేటాయించింది. మొదటి జాబితాలో అత్యధికంగా వెస్ట్ బెంగాల్‌లో 17, కేరళలో 15, తమిళనాడులో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.