జహీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సమీపంలోని ఆల్ఫా ఇంజనీరింగ్ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుడు సంగమేశ్(35) బుధవారం ఒక్కసారి కుప్పకూలి చనిపోయినట్లు ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. పరిశ్రమలో పని చేస్తూ కుప్పకూలడంతో తోటి కార్మికులు అతడిని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సంగమేశ్ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు, తోటి కార్మికులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. ఎస్సై వారికి నచ్చజెప్పి యజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
