సూపర్ స్టార్ కృష్ణ మూడోతరం వారసుడిగా రమేష్ బాబు కొడుకు జై కృష్ణ... ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో జై కృష్ణ ఇలా ముచ్చటించాడు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ‘నిజం’లో చైల్డ్ క్యారెక్టర్ చేశా. షూటింగ్‌కు వెళ్లడం అదే ఫస్ట్ టైమ్.
ఆ తర్వాత అర్జున్, గుంటూరు కారం సినిమాల షూటింగ్స్‌కు వెళ్లాను. పదహారేళ్ల వయసులో యాక్టర్ కావాలని ఫిక్స్ అయ్యి ముంబై, పాండిచ్చేరి, న్యూయార్క్‌లలో శిక్షణ తీసుకున్నా. తిరిగొచ్చాక జెమినీ కిరణ్ గారి ద్వారా అజయ్ గారు పరిచయమై ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయింది. ఆయన మూడు నెలల పాటు వర్క్‌షాప్ చేయించారు. ఇందులో నేను పోషించిన శ్రీను క్యారెక్టర్ వెరీ ఫన్ లవింగ్. అల్లరి చేస్తాడు. తనకేం కావాలో తనకి క్లియర్‌గా తెలుసు. అతను మంగను ప్రేమించాక ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది.
ఇందులోని క్యారెక్టర్స్, ఎమోషన్స్ అన్నీ రా అండ్ రస్టిక్‌గా ఉంటూ సినిమా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. రెగ్యులర్ లవ్‌స్టోరీకి భిన్నంగా స్ట్రాంగ్ ఎమోషన్స్, ట్విస్టులతో సర్‌ప్రైజ్ చేస్తుంది. 70 రోజుల పాటు అవుట్‌డోర్‌లో షూట్ చేశాం. ఆ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నా. ఇందులోని ప్రేమకథతో పాటు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మోహన్ బాబు గారితో నటించడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. రాషా ఈ సినిమాకు మంచి అసెట్. ఇక టీజర్, ట్రైలర్‌లోని కొన్ని షాట్స్‌లో నేను మహేష్ బాబాయిలా కనిపించానని కామెంట్స్ వస్తున్నాయి. కానీ సినిమా చూసినప్పుడు మాత్రం అలా అనిపించదు.
శ్రీను క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. బాబాయ్ తొలి సినిమా చేసిన వైజయంతి సంస్థలోనే నేను హీరోగా లాంచ్ అవడం ఫుల్ హ్యాపీ. ప్రతి విషయంలో మహేష్ బాబాయ్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ సినిమా చూసి హ్యాపీ ఫీలయ్యారు. ఆయనకు చాలా నచ్చింది. నా యాక్టింగ్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు, సాంగ్స్ చాలా నచ్చాయని మెసేజ్ చేశారు. ఓ నటుడిగా నాకు అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. అయితే పర్సనల్‌గా యాక్షన్ సినిమాలంటే ఇష్టం. యాక్టర్ కావాలనుకున్నప్పుడే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నా’’.
