కేసీఆర్ నోట జై మహారాష్ట్ర .. వాటేగావ్ సభలో నినదించిన సీఎం

కేసీఆర్ నోట జై మహారాష్ట్ర .. వాటేగావ్ సభలో నినదించిన సీఎం
  • కేసీఆర్ నోట జై మహారాష్ట్ర
  • వాటేగావ్ సభలో నినదించిన సీఎం
  • అన్నబాహు సాఠేకు భారతరత్న ఇవ్వాలి
  • మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయండి
  • తెలంగాణ కూడా తీర్మానం చేస్తుందని వెల్లడి 

కొల్హాపూర్ : కేసీఆర్ నోట జై మహారాష్ట్ర నినాదం వినిపించింది. మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై దృష్టి సారించిన కేసీఆర్ తొలిసారిగా అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొనేందుకు తన ప్రసంగం చివరలో జై మహారాష్ట్ర అంటు ముగించడం గమనార్హం. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఇవాళ కొల్లపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం.. ఆ తర్వాత సాంగ్లీ జిల్లా వాటేగావ్ తాలూకా కేంద్రంలో నిర్వహించిన అన్నాభావు సాఠే జయంతి వేడుకల్లోపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నా భావు సాఠే పుట్టిన స్థలానికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. అన్నా భావు సాఠేకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. షిండే సర్కారు తీర్మానం చేసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతుంన్నారు. అన్నా భావు సాఠేకు భారత రత్నఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. అణగారిన వర్గాల పక్షాన అన్నాభావు అనేక రచనలు చేశారని పేర్కొన్నారు. రష్యా వంటి దేశాలు ఆయనను గుర్తించినా భారత దేశం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. మాతంగి సామాజిక వర్గానికి రాజకీయంగా కావాల్సినంత ప్రాధాన్యం దక్కలేదని, బీఆర్ఎస్ వాళ్లకు అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. అన్నభావు రచనలన్నింటినీ అన్ని భాషాల్లోకి తర్జుమా జరగాలని ఆకాంక్షించారు.