మహబూబ్ నగర్ లో జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి పురస్కారాలు అందజేత

మహబూబ్ నగర్ లో జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి పురస్కారాలు అందజేత

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: నగరంలోని జయప్రకాశ్  నారాయణ ఇంజనీరింగ్  కాలేజీలో ఉత్తమ పార్లమెంటేరియన్  అవార్డ్  గ్రహీత మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి 84వ జయంతిని జరుపుకున్నారు. పోతుల రాంరెడ్డి, గద్వాల చంద్రశేఖర రావుకు జైపాల్​రెడ్డి స్మారక స్ఫూర్తి పురస్కారాలను అందజేసి అభినందించారు. 

చీఫ్​గెస్ట్​గా హాజరైన పర్యావరణ వేత్త, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్  ప్రొఫెసర్  పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ జైపాల్ రెడ్డి విలువలతో కూడిన జీవితం గడిపారని గుర్తు చేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మైనారిటీ కార్పొరేషన్  చైర్మన్  ఒబేదుల్లా కొత్వాల్, కాలేజీ చైర్మన్  కేఎస్  రవికుమార్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, బాద్మి శివకుమార్, సూదిని రాంరెడ్డి, మనోహర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, సాయిరెడ్డి, జూపల్లి భాస్కర్ రావు పాల్గొన్నారు.

ఆమనగల్లు: జైపాల్ రెడ్డికి కడ్తాల్, ఆమనగల్లు, ఆయన స్వగ్రామమైన మాడ్గుల్ లో వివిధ పార్టీల నాయకులు, అభిమానులు, కుటుంబసభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జాతీయ బీసీ కమిషన్  మాజీ సభ్యుడు ఆచారి, జైపాల్​రెడ్డి సోదరులు పద్మా రెడ్డి, రాంరెడ్డి, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.