లోక్‌‌‌‌‌‌‌‌సభ సీట్ల పెంపుపై  ప్రధాని మోదీవి పచ్చి అబద్ధాలు : జైరాం రమేశ్

లోక్‌‌‌‌‌‌‌‌సభ సీట్ల పెంపుపై  ప్రధాని మోదీవి పచ్చి అబద్ధాలు : జైరాం రమేశ్
  • ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా లోక్‌‌‌‌‌‌‌‌సభ సీట్ల పెంపు విషయంలో ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. అన్ని రాష్ట్రాల్లో ఒకే నిష్పత్తిలో లోక్‌‌‌‌‌‌‌‌సభ సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదంటూ చెప్పడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించడంలో, వంచించడంలో ఆయన తన పాత పద్ధతినే అనుసరిస్తున్నారని ఫైర్ అయ్యారు.  ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియలో కేంద్రప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, విదేశీ విధానంలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని జైరాం రమేశ్ ఆరోపించారు. 

దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం

జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే ఉత్తరాది-, దక్షిణాది రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతుందని ఏఐసీసీ ఆయన గణాంకాలతో వివరించారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించి, జనాభా పెంచిన రాష్ట్రాలకు ఆధిపత్యాన్ని కట్టబెట్టడమే మోదీ వ్యూహం అని- ఆరోపించారు.