జైషే మొహమ్మద్ కమాండర్ షమ్ సోఫీ కాల్చివేత

జైషే మొహమ్మద్  కమాండర్ షమ్ సోఫీ కాల్చివేత

జమ్మూకశ్మీర్ లో భారత ఆర్మీ సిబ్బంది మరో భారీ విజయాన్ని సాధించాయి. ఉగ్ర సంస్థ జై షే మొహమ్మద్ కు చెందిన టాప్ కమాండర్ షమ్ సోఫీని బలగాలు కాల్చి చంపాయి. ఈ విషయాన్ని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. పుల్వామాలో జరిగిన ఎన్ కౌంటర్ లో షమ్ సోఫీని సంయుక్త బలగాలు హతమార్చాయని చెప్పారు. ఐదుగురు పాక్ ప్రేరేపిత జైష్ ఉగ్రవాదులు ఇటీవలే సరిహద్దులను దాటి భారత్ లో అడుగుపెట్టారు. ఐదుగురు సాధారణ పౌరులను చంపేశారు. హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకుని మారణహోమానికి పాల్పడ్డారు. దీంతో.. సైన్యం ఉగ్రవాదులను  ఏరివేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఇటీవలి కాలంలో సైన్యం 10 మంది టెర్రరిస్టులను చంపేసింది.