2న ఢిల్లీలో బీసీల పోరు గర్జన : జాజుల శ్రీనివాస్​ గౌడ్

2న ఢిల్లీలో బీసీల పోరు గర్జన : జాజుల శ్రీనివాస్​ గౌడ్
  • జాజుల శ్రీనివాస్​ గౌడ్ వెల్లడి​ ​ 

ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణలో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును పార్లమెంటులోనూ ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇందుకోసం వచ్చే నెల 2న ఢిల్లీలోని జంతర్​మంతర్​వద్ద ‘బీసీల పోరు గర్జన’ పేరుతో మహాధర్నా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుందారం గణేశ్​చారి, శ్యామ్​కురుమ, విక్రమ్ గౌడ్, బాలరాజు గౌడ్, కల్కచర్ల శ్రీనివాస్​ముదిరాజ్ తో కలిసి ఆదివారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. 

బీసీ రిజర్వేషన్లను పెంచుతూ బిల్లు పెట్టినందుకు సీఎం రేవంత్​రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ ఇతర రాజకీయ పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటం తెలంగాణలో పూర్తయిందని, ఇప్పుడు దానిని ఢిల్లీకి  విస్తరిస్తున్నామని వెల్లడించారు. ఈ ధర్నాకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి  బీసీ దండు ఢిల్లీకి హాజరవుతుందన్నారు.