- పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు బీసీ సంఘాల వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చిన విధంగా రూ. 20 వేల కోట్లు కేటాయించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీల అబివద్ధి కోసం ‘బీసీ సబ్ ప్లాన్’ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. బుధవారం బీసీ నేతల బృందంతో కలిసి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని గుర్తు చేశారు. బీసీ కులవృత్తుల ఉపాధి కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించి, వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని విన్నవించారు. బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా.. వాస్తవానికి అందులో సగం కూడా విడుదల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
