IND vs ENG, 2nd Test: భారీ టార్గెట్ మాకు కష్టం కాదు.. 60 ఓవర్లలోనే కొట్టేస్తాం: అండర్సన్

IND vs ENG, 2nd Test: భారీ టార్గెట్ మాకు కష్టం కాదు.. 60 ఓవర్లలోనే కొట్టేస్తాం: అండర్సన్

టెస్టుల్లో 399 పరుగుల లక్ష్యం అంటే మ్యాచ్ పై బౌలింగ్ టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఒత్తిడంతా ఛేజింగ్ చేసే జట్టుపైనే ఉంటుంది. అయితే ఇంగ్లాండ్ విషయంలో ఈ లెక్క మారాల్సిందే. బజ్ బాల్ ఆటతో భారీ ఛేజింగ్ ఉన్నా అస్సలు భయపడరు. వికెట్లు పడుతున్నా వచ్చిన వాళ్ళు వేగంగా ఆడే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వైజాగ్ టెస్టులో టీమిండియాను కంగారెత్తించడానికి సిద్ధంగా ఉందని ఆ జట్టు పేసర్ జేమ్స్ అండర్సన్ ధీమా వ్యక్తం చేశాడు. 

రెండో ఇన్నింగ్స్ లో గిల్ సెంచరీతో ఇంగ్లాండ్ ముందు టీమిండియా 399 పరుగుల టార్గెట్ విధించింది. అయితే భారత్ సెకండ్ ఇన్నింగ్స్ కు ముందు కోచ్ మెక్కలం జట్టుకు ఏం చెప్పాడో అండర్సన్ తెలిపాడు. భారత్ 600 టార్గెట్ విధించినా విజయం కోసం ఆడాలని మెక్కలం తనకు చెప్పాడని అండర్సన్ అన్నారు. భారత జట్టు విధించిన 399 పరుగుల లక్ష్యాన్ని నాలుగో రోజు 60 లేదా 70 ఓవర్లలో ఛేజ్ చేస్తామని.. ఇంగ్లాండ్ భయపడకుండా.. ఆత్మ విశ్వాసంతో ఉందని ఈ దిగ్గజ పేసర్ అన్నారు. 

ప్రస్తుతం ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. వికెట్ నష్టానికి 67 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ రెహన్ అహ్మద్ వికెట్ ను కోల్పోయింది. 5 బౌండరీలతో 23 పరుగులు చేసిన నైట్ వాచ్ మెన్ రెహన్ అహ్మద్.. అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్ లో క్రాలి (41), ఓలీ పోప్(4)  ఉన్నారు. ఇంగ్లాండ్ గెలవాలంటే మరో 298 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.