జమ్మూ కాశ్మీర్ లో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఓటు హక్కు వినియోగించు కు నేందుకు జమ్మూకాశ్మీర్ ఓటర్లు పెద్దఎత్తున తరలి వచ్చారు. సెప్టెంబర్ 18 సాయంత్రం 5గంటల వరకు 58.37 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.
జమ్మూ కాశ్వీర్ లో మొత్తం 23.27 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో 11.73 లక్షల మంది పురుషులు, 11.51 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొదటి దశలో మొత్తం 24 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు అధికారులు. చీనాబ్ వ్యాలీ జిల్లాలైన దోడా, కిష్త్వార్, రాంబన్ తోపాటు,దక్షిణ కాశ్మీర్ లోని అనంతనాగ్, పుల్వామా, కుల్గాం, పోపియాన్ జిల్లాల్లో మొదటి దశ ఎన్నికలు జరిగాయి.
Also Read :- ఒక్క రూపాయి లంచం తీసుకున్నాడని.. ఉద్యోగం పీకేశారా..?
ఇక మొదటి దశలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో సీసీఐ‘(ఎం) కి చెందిన మహ్మద్ యూసుఫ్ తరిగామా ఉన్నారు. కుల్గాం సెగ్మెంట్ నుంచి ఐదోసారి పోటీలో ఉన్నారు. ఏఐ సీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్ కూడా పోటీలో ఉన్నారు. దూరు సెగ్మెంట్ నుంచి మీర్ మూడోసారి బరిలో ఉన్నారు.
ఇక నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన సకీనా ఇటూ..హాజీపోరా నుంచి పోటీలో ఉన్నారు. అయితే పీడీపీకి చెందిన ఇల్తిజా ముఫ్తీ, వహీద్ పారా పోటీ చేస్తున్న శ్రీగుఫ్వారా, బిజ్ బెహరా, పుల్వామా అసెంబ్లీ సెగ్మెంట్లపై నే అందరి దృష్టి ఉంది.