కోట్ల రూపాయలు లంచంగా తీసుకునోళ్లను చూశాం.. లక్షలు, వేల రూపాయలు లంచంగా తీసుకున్న వాళ్ళను చూశాం. కానీ, ఒక్క రూపాయి లంచంగా తీసుకున్నోళ్లను ఎక్కడైనా చూశారా.. అవును, నిజమే.. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పని చేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఒక్క రూపాయి లంచం తీసుకొని దొరికిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
జగదౌర్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఫార్మసిస్ట్ గా పని చేస్తున్న జగదీష్, రోగుల నుండి రూపాయికి బదులుగా రెండు రూపాయలు వసూలు చేస్తున్నాడన్న కారణంగా అతన్ని తొలగించారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పటేల్ హెల్త్ సెంటర్ పై నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ విషయం బయటపడటంతో జగదీష్ పై చర్యలకు ఆదేశించారు.
Also Read :- లెబనాన్‌లో పేలిన పేజర్లు.. 8 మంది మృతి
పేద రోగుల నుండి అధికారికంగా వసూలు చేయాల్సిన ఒక్క రూపాయి కన్నా ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నందుకు సదరు ఉద్యోగిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించటంతో అధికారులు అతన్ని విధుల నుంచి తొలగించారు.
देश को ऐसे नेताओं की सख्त जरूरत है.! 🙏 🫡
— Beerendra Patel (@Beeru3285) September 17, 2024
उत्तर प्रदेश के महाराजगंज ज़िले के सरकारी अस्पताल में BJP विधायक प्रेम सागर पटेल के औचक निरीक्षण में फार्मासिस्ट द्वारा पर्ची के लिए 1 की जगह 2 रुपए लिया जा रहा था। फिर क्या विधायक जी का गुस्सा देखिये, अफ़सरों को जमकर खरी खोटी सुनाई.! pic.twitter.com/KKXOEMBP6N