V6 News

ట్రాక్టర్ బోల్తా..  బాలుడు మృతి ..జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఘటన

ట్రాక్టర్ బోల్తా..  బాలుడు మృతి ..జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఘటన

పాలకుర్తి, వెలుగు : ట్రాక్టర్ బోల్తాపడి బాలుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో జరిగింది. ఎస్సై దూలం పవన్ కుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాసోజు ఉపేంద్ర బ్రహ్మచారి కొడుకు సాయి సంగీత్ (15) శనివారం స్నేహితుడు నితిన్ ​ట్రాక్టర్​పై పొలానికి వెళ్తున్నారు. గ్రామ సమీపంలోని ముడుసుగడ్డ తండా వెళ్లే దారిలో ఎదురుగా వస్తున్న కారును తప్పించగా ట్రాక్టర్​ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కందకంలో పడింది. దీంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న నితిన్ ప్రాణాలతో బయట పడగా, సాయి సంగీత్ అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.