యువతి కడుపులో తొమ్మిది కేజీల కణితి.. సర్జరీ ద్వారా తొలగించిన జనగామ డాక్టర్లు

యువతి కడుపులో తొమ్మిది కేజీల కణితి.. సర్జరీ ద్వారా తొలగించిన జనగామ డాక్టర్లు
  • సర్జరీ ద్వారా తొలగించిన జనగామ డాక్టర్లు  

జనగామ అర్బన్, వెలుగు : యువతి కడుపులో తొమ్మిది కేజీల కణితిని సర్జరీ చేసి డాక్టర్లు తొలగించి సక్సెస్ అయ్యారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆమెను డాక్టర్లు పరీక్షించి కడుపులో పెద్ద కణితిని గుర్తించారు. ఆదివారం జనగామ టౌన్ లోని రవళి నర్సింగ్​హోమ్​డాక్టర్లు యువతికి సర్జరీ చేసి.. సుమారు 9 కేజీల కణితిని తొలగించారు. ఆస్పత్రి డాక్టర్ రాజమౌళి ఇప్పటికే పలుమార్లు అరుదైన శస్త్ర చికిత్సలు చేసి పేరుపొందారు. సర్జరీలో ఆయనతో పాటు సిబ్బంది అలిసిరి శ్రీనివాస్, మోర్తాల ప్రభాకర్, రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.