ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటం...జానకంపేట్ గ్రామస్తుల హెచ్చరిక

ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటం...జానకంపేట్ గ్రామస్తుల హెచ్చరిక

ఎడపల్లి, వెలుగు: ఆలయ పాలకవర్గంలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఎండోమెంట్​అధికారులు ఇతరులకు స్థానం కల్పించారని, పాలకవర్గ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటామని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామస్తులు హెచ్చరించారు. సోమవారం లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

తమ గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి పాలకవర్గంలో అధికారులు జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి ఎలా స్థానం కల్పిస్తారని ప్రశ్నించారు. ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అడ్డుకుంటామని వెల్లడించారు. ఎండో మెంట్​శాఖ అసిస్టెంట్​కమిషనర్, ఆలయ ఈఓ వేణుకు వినతిపత్రం అందజేశారు.