తెలంగాణ మీ అయ్య జాగీరా.. నన్నే బెదిరిస్తారా : పవన్ కల్యాణ్

తెలంగాణ మీ అయ్య జాగీరా.. నన్నే బెదిరిస్తారా : పవన్ కల్యాణ్

తెలంగాణ రానివ్వం అంటున్నరు.. ఇదేమైనా మీ అయ్య జాగీరా అంటూ ప్రశ్నించరు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. 2026 జూన్ 02న హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్. హైదరాబాద్ లో ఎలా కాలుపెడతావో చూస్తాం అంటున్నారు.. మీరెవరు నన్ను బెదిరించడానికి.. అని ప్రశ్నించారు. తనను ఎంత తిట్టినా పట్టించుకోనని ఈ సందర్భంగా పవన్ అన్నారు. తెలంగాణ కంటే ఏపీలోనే బెదిరింపులు ఎక్కువ అని..  భయపడే వాళ్లం అయితే పార్టీ పెడతామా అని అన్నారు. 

పవన్ కామెంట్స్:

  • తెలంగాణ నడిబొడ్డున జనసేన పుట్టింది
  • హైదరాబాద్ నడిబొడ్డున పార్టీ ఆవిర్భవించింది
  • జనసేన తెలంగాణకు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారు
  • తెలంగాణలో లక్ష మంది జనసైనికులు ఉన్నారు
  • తెలంగాణపై నాకున్న ప్రేమ రాజకీయాలకు అతీతం
  • రాష్ట్ర విభజన తీరుకు మాత్రమే వ్యతిరేకం.. విభజనకు కాదు
  • తెలంగాణ నలుమూలలా తిరిగిన వాడిని
  • ఓట్లు పడతాయని కాదు.. ఆ రోజుల్లోనే తండాల దాహార్తిని తీర్చాం
  • ఏపీలో నన్ను తిరగనివ్వం అంటే తెలంగాణలో వారాహికి పర్మిషన్ ఇచ్చారు
  • కోదాడ, నల్గొండ ప్రజలు అండగా నిలిచారు
  • ఇవాళ విమర్శించే గొంతులు 2007లో లేవు
  • గోండు తాండాల్లో తిరిగిన నాడు ఇవాళ విమర్శించే గొంతులు లేవు
  • నాకు లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ తెలియదు.. నాది హ్యూమనిజం
  • దాడులు మాకు కొత్త కాదు.. వైయస్ హయాంలోనే చూశాం
  • మర్రి చెన్నారెడ్డి సినిమా ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకొచ్చారు
  • ఆంధ్ర వాళ్లను తిడుతూ ఉంటే వాళ్లు ఇక్కడెలా ఉంటారు
  • ఇంకెంత కాలం ఆంధ్రా వాళ్లను తిడుతూ కాలక్షేపం చేస్తారు
  • నేను చెరువు కబ్జా చేశానని అంటున్నారు
  • అలా చేస్తే నన్ను ఇక్కడ ఉండనిస్తారా..
  • సీఎం రేవంత్ అంటే  గౌరవం ఉంది.. 
  • కబ్జా చేసినట్లు నిరూపిస్తే ప్రభుత్వానికి రాసిస్తా..
  • కేసీఆర్ బీఆఎస్ పెడితే ఆంధ్రలో స్వాగతించిన వాడిని నేను
  • యురేనియం మైనింగ్ జరుగుతుంటే శ్రీశైలం వెళ్లి పోరాడా
  • మీరు అన్ని రాష్ట్రాలకు వెళ్లొచ్చు.. నేను ఇక్కడికి రాకూడదా..?