భాషను మంటకలిపితే మట్టి కొట్టుకుపోతారు: పవన్

భాషను మంటకలిపితే మట్టి కొట్టుకుపోతారు: పవన్

బాషను చంపుకోవటం అంటే ఉనికిని చంపుకోవడమేనని అన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్. బుధవారం ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలోని విశాలాంధ్ర బుక్ హౌస్, ఎమెస్కో విక్రయ కేంద్రాలను సందర్శించిన ఆయన… మీడియాతో మాట్లాడారు… తెలుగు భాషను రక్షించుకోవాలని… ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తెలుగును విస్మరిస్తుందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడివెళ్లినా ఆయా జాతుల వాళ్లు వారి భాషను రక్షించుకుంటారని అన్నారు.

తమ భాషను, యాసను, సంసృతిని అవమానించారని తెలంగాణ వాళ్లు ఏకంగా రాష్ట్రాన్నే సాధించుకున్నారని అన్నారు పవన్. అలాంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషపై ఎందుకు వివక్షచూపుతుందని ప్రశ్నించారు. ఆంధ్ర నాయకులకు, మేధావులకు తెలుగు భాషపై ప్రేమలేదని.. ఒకవేల ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు.

దేశ స్వాతంత్య సమయం నుంచే తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలనుకున్నారని.. అదేవిధంగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగు ఉనికిని, భాషను మంటగలిపే ప్రయత్నాలు చేస్తే మట్టిలో కలిసిపోతారని అన్నారు. తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తూ తెలుగు పత్రికలను నడుపుతున్నారని అన్నారు. తెలుగు చదువుకునే వాళ్లపై సరైన వసతులు, వనరులు కల్పించకుంటే రాజ్యంగాన్ని అగౌరవ పరిచినట్టేనని చెప్పారు.