జనసేన  టెంట్ హౌస్ పార్టీ: పేర్నినాని

జనసేన  టెంట్ హౌస్ పార్టీ: పేర్నినాని

ఓట్ల కోసమే రాజకీయాలు చేయడం పవన కళ్యాణ్ కి చెల్లిందన్నారు మాజీ మంత్రి పేర్నినాని.   ఆయనకు బలం లేదని ఇప్పుడు తెలిసిందా అని ప్రశ్నించారు. 2014 లోనే బలం లేదని తెలుసు కాబట్టే  అప్పుడు పోటీ చేయలేదన్నారు.  2019లో చంద్రబాబు పట్ల ప్రజావ్యతిరేకత ఉన్నందున...ఆ  ఓటు జగన్మోహన్ రెడ్డికి వెళ్లకుండా  చీల్చడానికి పవన్ బరిలోకి దిగాడని పేర్ని నాని విమర్శించారు.   ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు ఉంటే టెంట్ హౌస్ కు వెళ్లి అవసరమైన  సామాన్లు తెచ్చుకున్నట్లు.. చంద్రబాబు అవసరాలకు జనసేన టెంట్ హౌస్ పార్టీలా మారిందన్నారు. 
 
గతంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వదులుకొని పవన్ కళ్యాణ్ ను సీఎం  చేయాలని కొంతమంది గ్రామ గ్రామాన తిరిగిన జనసైనికుల త్యాగాలను గుర్తించి.. వారి తల్లి దండ్రుల ఆశలను పవన్ కళ్యాణ్ తీర్చాలన్నారు.  గతంలో ఏడాదికి  100 కోట్ల రూపాయిులు  వదులుకొని రాజకీయాలు చేస్తున్నానన్న పవన్.. ఇప్పుడు  చంద్రబాబు కు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయటకు వచ్చి ఏదో వాహనం.. అంటూ హడావిడి చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని  మాజీ మంత్రి పేర్నినాని.