హైదరాబాద్ సిటీ, వెలుగు: గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగమైన 3000 మి.మీ. ఎంఎస్ పంపింగ్ మెయిన్‌కు బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ సమీపంలోని శ్రీనివాస్ నగర్ బ్రిడ్జ్ వద్ద లీకేజీ ఏర్పడింది. సమస్యను పరిష్కరించేందుకు పైపులో అత్యవసర రిపేర్లు చేపట్టారు. దీంతో శనివారం నగరంలోని అనేక ప్రాంతాల్లో నీటి సరఫరా పాక్షికంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఎస్.ఆర్.నగర్, సనత్‌నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగళ్‌రావ్‌నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్ సెక్షన్లు, కూకట్‌పల్లి, భాగ్యనగర్, వివేకానందనగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భరత్‌నగర్, మోతీనగర్, గాయత్రినగర్, బాబానగర్, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, హస్మత్‌పేట్ సెక్షన్, చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్‌నగర్, గాజులరామారం, సూరారం, ఆదర్శ్‌నగర్, భగత్‌సింగ్‌నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ సెక్షన్, అల్వాల్, ఫాదర్ బాలయ్యనగర్, వెంకటాపురం, మచ్చబొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్‌పాయినగర్, యాప్రాల్, చాణక్యపురి, గౌతమ్‌నగర్, సాయినాథ్‌పురం సెక్షన్, చర్లపల్లి, సాయిబాబానగర్, రాధిక సెక్షన్లు, కొండాపూర్, మాదాపూర్‌లో కొంతభాగం, హఫీజ్‌పేట్, మియాపూర్ సెక్షన్లు, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం సెక్షన్లు, ఎంఈఎస్, త్రిశూల్ లైన్లు, గన్‌రాక్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, కంటోన్మెంట్, ఏఐఐఎంఎస్–బీబీనగర్, ఆలేరు (భువనగిరి), ఘనపూర్ (మేడ్చల్/శామీర్‌పేట్) ప్రాంతాల్లో మధ్యాహ్నం తరువాతే నీటి సరఫరా అందుతుందని అధికారులు స్పష్టం చేశారు.
