జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు యూరప్ లో అనుమతి

జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు యూరప్ లో అనుమతి

కరోనా వైరస్ నివారణకు ఇస్తున్నటీకాలన్నీ రెండు డోసుల వ్యాక్సిన్లే. అయితే... అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫార్మా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. లేటెస్టుగా ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ వినియోగానికి యూరోపియన్ యూనియన్ డ్రగ్ కంట్రోల్ రెగ్యులేటరీ యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (EMA) అనుమతులు మంజూరు చేసింది. దీంతో యూరప్ ఖండంలోని 27 దేశాలకు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

జాన్సన్ అండ్ జాన్సన్ అందించిన వ్యాక్సిన్ డేటాను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే పర్మిషన్ ఇచ్చినట్టు యూరప్ డ్రగ్ కంట్రోల్ రెగ్యులేటరీ స్పష్టం చేసింది.