జనగామ మున్సి పల్ మీటింగ్ రసాభాస

జనగామ మున్సి పల్ మీటింగ్ రసాభాస

జనగామ, వెలుగు : జనగామ మున్సిపాలిటీ సాధారణ సమావేశం గురువారం రసాభాసగా సాగింది. పోడియంపై చైర్ పర్సన్ కడకంచి బాలమణి, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి కూర్చున్నారు. దీంతో పోడియంపైకి వైస్ చైర్మన్ భూష పర్వతాలు ఆహ్వానించాలని బీఆర్ఎస్​ మెంబర్లు కోరారు. అయితే రూల్స్ ఒప్పుకోవని కమిషనర్, చైర్ పర్సన్​ స్పష్టం చేశారు. గడిచిన పదేండ్లలో మున్సిపాలిటీ సమావేశాల్లో వైస్ చైర్మన్​ను గౌరవించారని, ఇప్పుడు కూడా ఇతర మున్సిపాలిటీల్లో గౌరవిస్తున్నందున ఇక్కడ కూడా పోడియంపైకి పిలవాల్సి ఉంటుందని బీఆర్ఎస్​ కౌన్సిలర్లు డిమాండ్ చేసినా చైర్ పర్సన్ ఒప్పుకోలేదు. దీంతో బీఆర్ఎస్​ కౌన్సిలర్లు పోడియంపైకి కుర్చీ తీసుకొని రాగా, వైస్ చైర్మన్ బూష పర్వతాలు కూర్చున్నారు. 

పోలీసులు రంగప్రవేశం చేసి పోడియంపై నుంచి వైస్ చైర్మన్​ను పక్కకు తప్పించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్​ కౌన్సిలర్ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. కమిషనర్​ మహేశ్వర్​రెడ్డి మాట్లాడుతూ రూల్ ప్రకారం చైర్ పర్సన్ లేని పక్షంలోనే వైస్ చైర్మన్ పోడియంపై కూర్చోవాల్సి ఉంటుందని, వైస్​ చైర్మన్​ కూర్చోవచ్చని ఏదైనా ఆధారం ఉంటే చూపాలని కోరారు. దీంతో బీఆర్ఎస్​ కౌన్సిలర్లు పోడియం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్​, చైర్​ పర్సన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి చర్చజరగకుండా మీటింగ్ వాయిదా పడింది.