జనగామ : భూ సమస్యను పరిష్కరించాలంటూ జనగామ కలెక్టరేట్లో దంపతులు ఆత్మహత్యయత్నం చేశారు. కలెక్టర్ కార్యాలయం పైకి ఎక్కి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొనేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని కాపాడారు. పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు దంపతులకు గ్రామంలో కొంత భూమి ఉంది. అయితే తాతల కాలం నాటి 8 ఎకరాల వ్యవసాయ భూమిని రెవెన్యూ అధికారులు వేరొకరికి పట్టా చేశారని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మాహత్యాయత్నం చేసినట్లు చెప్పారు.
