కోలీవుడ్‌‌లోకి జాన్వీ కపూర్ క్రేజీ ఎంట్రీ..

కోలీవుడ్‌‌లోకి జాన్వీ కపూర్ క్రేజీ ఎంట్రీ..

‘దేవర’ చిత్రంతో టాలీవుడ్‌‌ ఎంట్రీ ఇచ్చి.. త్వరలో  ‘పెద్ది’ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జాన్వీ  కపూర్.. ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది.  తమిళ స్టార్ ధృవ్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతోన్న   న్యూ ఏజ్ లవ్ స్టోరీలో జాన్వీ హీరోయిన్‌‌గా నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది.    

ఇటీవల ‘బైసన్’ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధృవ్   ఓ స్టైలిష్ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రానికి దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పలువురి పేర్లను  పరిశీలించిన మేకర్స్, కథకు ఫ్రెష్ పెయిర్ బాగా సెట్ అవుతుందని భావించి  చివరకు జాన్వీ కపూర్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.  

ఇందులో ఆమె మోడర్న్ గర్ల్‌‌గా  స్టైలిష్ పాత్రలో కనిపించనుందట.  మరో  ఆసక్తికర విషయం ఏమిటంటే, ‘పెద్ది’ చిత్రాన్ని నిర్మిస్తున్న  మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్‌‌‌‌లోనే ఈ తమిళ చిత్రం కూడా  రూపొందనుందనే న్యూస్ వైరల్ అవుతోంది.  సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నాడట.