నెల గ్యాప్‌‌తో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో జాన్వీ కపూర్ సందడి

నెల గ్యాప్‌‌తో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో జాన్వీ కపూర్ సందడి

వరుణ్‌‌ ధావన్‌‌, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’. శశాంక్ ఖైతన్‌‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌‌ బ్యానర్‌‌‌‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. సన్నీగా వరుణ్‌‌, తులసి పాత్రలో జాన్వీ కపూర్ నటించారు. మనీష్ పాల్, అక్షయ్ ఒబేరాయ్, సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌‌ జరుగుతున్నాయి. ‘పెళ్లికి మండపం రెడీ అయ్యాక.. సన్నీ, తులసి ఎంట్రీతో మొత్తం స్క్రిప్ట్‌‌ మారిపోయింది’ అంటూ సోమవారం ఈ మూవీ టీజర్‌‌‌‌ రిలీజ్‌‌ డేట్‌‌ను ప్రకటించారు.

ఆగస్టు 28న టీజర్‌‌‌‌ను విడుదల చేయబోతున్నట్టు చెబుతూ మోషన్ పోస్టర్‌‌‌‌ వదిలారు. తులసి ప్రేమను దక్కించుకోవడానికి సన్నీ ఎలాంటి రిస్క్ చేశాడు అనేది మెయిన్‌‌ కాన్సెప్ట్‌‌. రొమాంటిక్‌‌ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా రూపొందించారు. నిజానికి సెప్టెంబర్‌‌‌‌ రెండో వారంలో సినిమా విడుదల కావాల్సి ఉండగా.. అక్టోబర్‌‌‌‌ 2కు వాయిదా వేశారు. ఇక సెప్టెంబర్ 29న ‘పరమ్ సుందరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న జాన్వీ కపూర్.. నెల రోజుల గ్యాప్‌‌తో మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది.