టాలీవుడ్‌‌లోకి జాన్వీకపూర్..ఎన్టీఆర్ తో జోడీ..!

టాలీవుడ్‌‌లోకి జాన్వీకపూర్..ఎన్టీఆర్ తో జోడీ..!

గ్లామరస్‌‌ ఫొటోషూట్స్‌‌తో అభిమానులను ఆకట్టుకునే జాన్వీకపూర్.. సినిమాల విషయంలో మాత్రం నటనకు ప్రాధాన్యత గల పాత్రలకే ఓకే చెబుతుంది. ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ఎక్కువ శాతం అలాంటివే. సరైన కమర్షియల్‌‌ సక్సెస్‌‌ కోసం ఎదురుచూస్తున్న ఆమె, గత కొన్నాళ్లుగా టాలీవుడ్‌‌లో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఎన్టీఆర్‌‌‌‌ కొత్త సినిమాతో ఆ ఆశలు నెరవేరేలా కనిపిస్తున్నాయి. కొరటాల శివ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌‌‌‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌‌‌‌కు జంటగా నటించబోయే హీరోయిన్‌‌ కోసం గత ఆరు నెలలుగా చాలామంది హీరోయిన్స్‌‌ను పరిశీలించిన టీమ్, జాన్వీని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 

అతి త్వరలో ఆమె గెటప్‌‌కు సంబంధించిన ఫొటోషూట్ చేయడంతో పాటు, అఫీషియల్‌‌గా తన పేరును ప్రకటించనున్నారు. నిజానికి ఇందులో హీరోయిన్‌‌ పాత్రకు తనను సంప్రదించినట్టు ఏడాది క్రితం జాన్వీనే చెప్పింది. ఫైనల్‌‌గా ఆ చాన్స్‌‌ ఆమెకే దక్కబోతోంది. ఈనెల 23న సెట్స్‌‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని ఆరు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి.