జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ రికార్డు బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేసిన సినర్‌‌‌‌‌‌‌‌

జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ రికార్డు బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేసిన సినర్‌‌‌‌‌‌‌‌

రోమ్‌‌‌‌‌‌‌‌: ఇటలీ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ జానిక్‌‌‌‌‌‌‌‌ సినర్‌‌‌‌‌‌‌‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.  ఇటాలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా గురు వారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో సినర్‌‌‌‌‌‌‌‌ 6–2, 6–4తో ఆండ్రీ రుబ్లేవ్‌‌‌‌‌‌‌‌ (రష్యా)పై గెలిచి సెమీస్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాడు. ఫలితంగా ఏటీపీ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌–1000 టోర్నీల్లో వరుసగా 32వ విజయాన్ని నమోదు చేశాడు.

 తద్వారా 2011లో జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ నెలకొల్పిన 31 వరుస విజయాల రికార్డును సినర్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేశాడు. గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో  షాంఘై మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పుకున్న సినర్‌‌‌‌‌‌‌‌.. ఆ తర్వాత జరిగిన ఏ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీలోనూ ఓటమి చెందలేదు.