యోకోహామా వైజాగ్ ప్లాంటులో మరింత ఉత్పత్తి

యోకోహామా వైజాగ్ ప్లాంటులో మరింత ఉత్పత్తి

వైజాగ్​ నుంచి వెలుగు: జపాన్​కు చెందిన టైర్ల తయారీ సంస్థ యోకోహామా వైజాగ్​లోని తన ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 శాతం నుంచి 70 శాతానికి పెంచామని ప్రకటించింది. గతంలో రోజుకు రెండు వేల టైర్లను తయారు చేసిన ఈ సంస్థ ఇప్పుడు రోజుకు ఐదు వేల టైర్లను ఉత్పత్తి చేస్తోంది.

 ఇక్కడ చిన్న కార్లు మొదలుకొని, ఎస్‌‌‌‌యూవీల వరకు అన్ని రకాల టైర్లను తయారు చేస్తున్నారు. భారత్‌‌‌‌లో రీప్లేస్‌‌‌‌మెంట్ మార్కెట్‌‌‌‌లో డిమాండ్ పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెటింగ్ హెడ్ గౌరవ్ మహాజన్ తెలిపారు. ఓఈఎం విభాగంలో మారుతి సంస్థకు టైర్లను సరఫరా చేస్తున్నారు. వైజాగ్ ప్లాంట్ కోసం ఇప్పటికే రూ.750 కోట్లు పెట్టుబడి పెట్టారు. యుద్ధం వల్ల ముడి పదార్థాల సరఫరాలో కొన్ని ఇబ్బందులు ఉన్నా, రోడ్ల నాణ్యత మెరుగుపడటం వల్ల టైర్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 17 లక్షల యూనిట్లని మహాజన్​ వివరించారు.