Jasprit Bumrah: సంపాదనలో బుమ్రా హవా.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Jasprit Bumrah: సంపాదనలో బుమ్రా హవా.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా క్రికెట్ పై తన ముద్రను వేస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా ఇరగదీస్తున్నాడు. ఇటీవలే టెస్టుల్లో అద్భుత బౌలింగ్ తో నెంబర్ వన్ ర్యాంక్ కు చేరుకున్నాడు. క్రికెట్ పరంగా టాప్ ఫామ్ లో దూసుకుపోతున్న ఈ గుజరాత్ సీమర్.. సంపాదనలోనూ సత్తా చాటుతున్నాడు. బుమ్రా ఇప్పటివరకు ఎంత సంపాధించాడో ఇప్పుడు చూద్దాం. 

-ప్రస్తుతం ఏ గ్రేడ్ కేటగిరిలో ఉన్న బుమ్రాకు బీసీసీఐ సంవత్సరానికి 7 కోట్లు చెల్లిస్తుంది. 
-ఇక ఒక వన్డే మ్యాచ్ కు 7 లక్షలు, టీ20 మ్యాచ్ కు 3 లక్షలు, టెస్ట్ మ్యాచ్ కు 15 లక్షల మ్యాచ్ ఫీజ్ దక్కుతుంది. 
-ఐపీఎల్ ద్వారా బుమ్రా ఏడాదికి 12 కోట్లు అందుకుంటున్నాడు. 

జస్ప్రీత్ బుమ్రాచే ఆమోదించబడిన బ్రాండ్లు

ASICS, OnePlus వేరబుల్స్, సీగ్రామ్ రాయల్ స్టాగ్, ట్విల్స్, బోట్, డ్రీమ్ 11, Unix, థమ్స్ అప్ లాంటి కమర్షిల్ యాడ్స్ చేస్తూ బిజీగా మారిన బుమ్రా భారీగా సంపాదిస్తున్నాడు. ప్రస్తుత బుమ్రా ఆస్తి విలువ 55 కోట్లుగా ఉంది. 

Also Read : అభిమానిగా మారిన జడేజా.. ధోనీ ఇంటి ముందు ఫోటోలు దిగుతూ సందడి

ప్రస్తుతం బుమ్రా ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. తొలి మూడు టెస్టుల్లో 17 వికెట్లు తీసిన ఈ స్పీడ్ స్టార్.. రాంచీలో జరిగిన నాలుగో టెస్టుకు విశ్రాంతిని ఇచ్చారు. మార్చ్ 8 నుంచి ధర్మశాలలో జరిగే చివరిదైన ఐదో టెస్టుకు జట్టుతో కలిసే అవకాశం ఉంది. టెస్ట్ సిరీస్ తర్వాత ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు.