
న్యూఢిల్లీ: ఒలింపియన్ జావెలిన్ త్రోయర్ శివ్‌పాల్ సింగ్ తన కెరీర్‌లో రెండోసారి డోప్ పరీక్షలో పట్టుబడ్డాడు. ‘అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్’లో భాగంగా ఈ ఏడాది ఆరంభంలో సేకరించిన యూరిన్ శాంపిల్‌లో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు నేషనల్ యాంటీ డోపింగ్ (నాడా) అధికారులు గుర్తించారు.
దీంతో శివ్‌పాల్‌ను నాడా తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఒకవేళ ‘బి’ శాంపిల్‌లోనూ నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలితే శివ్‌పాల్‌పై ఎనిమిదేళ్ల నిషేధం పడే చాన్స్ ఉంది. 2019 దోహా ఆసియా చాంపియన్‌షిప్‌లో ఈటెను 86.23 మీటర్ల దూరం విసిరిన శివ్‌పాల్ రజతం గెలిచాడు. 2021లోనూ శివ్‌పాల్ స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో అతనిపై నాడా నాలుగేళ్ల నిషేధం విధించింది.
అయితే తాను వాడిన సప్లిమెంట్స్‌లో స్టెరాయిడ్స్ ఉన్నట్లు తెలియదని నాడా అప్పీల్ ప్యానెల్ ముందు విజయవంతంగా వాదించడంతో నిషేధాన్ని ఒక ఏడాదికి పరిమితం చేసింది.