జవహర్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌ మేయర్‌‌‌‌‌‌‌‌ ఎన్నికకు రంగం సిద్ధం

జవహర్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌ మేయర్‌‌‌‌‌‌‌‌ ఎన్నికకు రంగం సిద్ధం

జవహర్ నగర్, వెలుగు: జవహర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌ మేయర్‌‌‌‌‌‌‌‌ ఎన్నిక సోమవారం జరగనుంది.  దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  మేయర్‌‌‌‌‌‌‌‌ పదవిని కాపాడేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసినా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ కార్పొరేటర్లే అవిశ్వాసానికి తెర లేపారు. 

మేయర్‌‌‌‌‌‌‌‌ కావ్యపై గుర్రుగా ఉన్న కార్పొరేటర్లు గత నెల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో 20 మంది ఆమెకు వ్యతిరేకంగా ఓటేశారు. కాగా జవహర్ నగర్ కార్పొరేషన్ 19వ డివిజన్ కార్పొరేటర్ శాంతి కోటేశ్ గౌడ్‌‌‌‌ మేయర్‌‌‌‌‌‌‌‌ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తనకు అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లను కలిసి మద్దతు  ఇవ్వాలని కోరుతున్నారు.  మేయర్‌‌‌‌‌‌‌‌ పదవి ఎవరిని వరిస్తుందో నేటితో తేలిపోనుంది.