సెలవుల్లో ఇంటికెళ్లిన జవాన్ ను చంపిన ఉగ్రవాదులు

సెలవుల్లో ఇంటికెళ్లిన జవాన్ ను చంపిన ఉగ్రవాదులు

సెలవుపై ఇంటికి వెళ్లిన జవాన్ ను కాల్చి చంపారు టెర్రరిస్టులు. ఈ ఘటన జమ్ములోని బారాముల్లాలో జరిగింది. మహమ్మద్ రఫీక్ యాటూ అనే జమ్మూకు చెందిన సోల్జర్ సెలవుల్లో భాగంగా ఇంటికి వెళ్లాడు. రఫీక్ సొంత ఊరు  బారాముల్లా కావడంతో ఉగ్రవాదులు అతని ఇంటిపై ఒక కన్నేసి ఉంచారు. సెలవులపై రఫీక్ ఇంటికి వచ్చాడన్న సమాచారంతో దాడి చేసి చంపేశారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ తో ఫైర్ చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు రఫీక్.

జమ్మూకు చెందిన జవాన్లు సెలవులపై ఇంటికి వెళ్లినప్పుడు ప్లాన్ చేసి చంపేస్తున్నారు తీవ్రవాదులు. ఇదివరకు ఒక జవాన్ ను కిడ్నప్ చేసి మరీ చంపిన ఘటన మరువకముందే రఫీక్ ను పొట్టన పెట్టుకున్నారు తీవ్రవాదులు.