జయమ్మ పంచాయితీ ట్రైలర్ రిలీజ్

జయమ్మ పంచాయితీ ట్రైలర్ రిలీజ్

యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జయమ్మ పంచాయితీ. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ మూవీకి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. మే 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. కామెడీతోపాటు భావోద్వేగాలతో కూడిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. జయమ్మగా సుమ నటన, ఆమె డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. దినేష్ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా  నటించిన జయమ్మ పంచాయితీ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.