జయరామ్ హత్యకేసు: ‘రాకేశే హంతకుడు’

జయరామ్ హత్యకేసు: ‘రాకేశే హంతకుడు’

వెలుగు: కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్‌ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు. జయరామ్‌ మేనకోడలు శిఖా చౌదరి స్నేహితుడు రాకేశ్ రెడ్డి హత్య చేసినట్లు తేలిందన్నారు. ఈ కేసులో శిఖా చౌదరికి ఎలాంటి పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. రాకేశ్ రెడ్డి, వాచ్ మెన్ శ్రీనివాస్ ను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. మంగళవారం ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. “టెక్రాన్ సంస్థలో సమస్యలు వచ్చినప్పుడు రాకేశ్ రెడ్డి దగ్గర జయరామ్‌ అప్పు తీసుకున్నారు. శిఖా చౌదరికి సహకరించాలని రాకేశ్ రెడ్డిని జయరాం కోరారు. ఈ క్రమంలో రాకేశ్ రెడ్డి, శిఖా చౌదరి మధ్య సంబంధాలు కొనసాగాయి. కొంత కాలంగా వాళ్లిద్దరి మధ్య సంబంధాలు లేవు. జయరామ్‌ తన డబ్బులు ఇవ్వకపోవడంతో శిఖా ఇంటి వద్ద రాకేశ్ రెడ్డి నిఘా ఏర్పాటు చేశాడు. గత నెల 29న జయరామ్‌ శిఖా చౌదరి ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని వాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్ రాకేశ్ రెడ్డికి చెప్పాడు. దీంతో ఓ అమ్మాయి పేరుతో రాకేశ్ రెడ్డి జయరామ్‌ తో చాటింగ్ చేశాడు. ఈ చాటింగ్ ద్వారా రాకేశ్ రెడ్డి ఇంటికి జయరామ్‌ వెళ్లాడు. తర్వాత డబ్బుల కోసం జయరామ్‌ ను నిలదీశాడు. జయరామ్‌ కోరిక మేరకు కోస్టల్ బ్యాంకు మాజీ మేనేజర్ ఈశ్వరప్రసాద్ రూ.6 లక్షలు చెల్లించాడు. విజయవాడలోని కోస్టల్ బ్యాంకు నుంచి డబ్బులు ఇస్తానని జయరామ్‌ రాకేశ్ రెడ్డితో చెప్పాడు. అయితే డబ్బుల కోసం జయరామ్‌ ను రాకేశ్ రెడ్డి కొట్టాడు. సోఫాపై ముఖం వేసి నొక్కడంతో ఊపిరాడక ఆయన చనిపోయాడు. మృతదేహాన్ని పథకం ప్రకారమే అక్కడి నుంచి కార్లో తరలించాడు. అందుకోసం ఇద్దరు పోలీసుల సలహాలు తీసుకున్నాడు” అని ఎస్పీ త్రిపాఠి చెప్పారు. ఈ కేసులో ఇంకా సాక్ష్యాలను సేకరించాల్సి ఉందన్నారు.

ఈ హత్యలో శిఖా చౌదరికి పాత్ర ఉందనేందుకు ఆధారాలు లేవని చెప్పారు. ఆమెను ఈ కేసు నుంచి తప్పించాల్సిన అవసరం తమకు లేదన్నారు. గతనెల 31న కృష్ణా జిల్లా ఐతవరం దగ్గర రాత్రి హైవే గస్తీ పోలీసులు జయరామ్‌ మృతదేహన్ని గుర్తించడం తెలిసిందే. సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల1న జయరామ్‌ మామ గుత్తా పిచ్చయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నందిగామ డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌ లు ఏర్పాటు చేసి సీసీటీవీ పుటేజీ, ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. వెలుగులోకి ఇద్దరు పోలీసుల పాత్ర జయరామ్‌ హత్య తర్వాత హైదరాబాద్ లోని నల్లకుంట సీఐ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో రాకేశ్ రెడ్డి మాట్లా డినట్టు ఆధారాలు లభించాయని కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి చెప్పారు. వారి సలహాతోనే జయరామ్‌ మృతదేహాన్ని రాకేశ్ రెడ్డి రాష్ట్ర సరిహద్దులు దాటించినట్లు తెలిసిం ది. ఇప్పటికే హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నల్లకుంట సీఐ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బదిలీ చేశారు. ఏసీపీ మల్లా రెడ్డిని అంబర్ పేట్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రకటించారు.