జయశంకర్​ ఆశయాలు నెరవేరుస్తున్నాం: సీఎం

జయశంకర్​ ఆశయాలు నెరవేరుస్తున్నాం: సీఎం

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్​ జయశంకర్​ ఆశ యాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నా మని సీఎం కేసీఆర్  పేర్కొన్నారు. జయ శంకర్​ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మర ణీయంగా ఉంటారని ఆయన తెలిపారు. 

జయశంకర్  జయంతి సందర్భంగా సీఎంవో నుంచి ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సకల జనుల సంక్షేమం, సబ్బండ వర్గాల సమానత్వం కోసమే ప్రత్యేక తెలంగాణ కావాలని ఆయన కోరుకునేవారని సీఎం తెలిపారు. 

తొమ్మిదేండ్లలోనే ఇరిగేషన్, అగ్రికల్చర్, విద్య, వైద్యం తదితర రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న దని అన్నారు. వ్యవసాయం నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో దేశంలో అగ్రగామిగా ఉన్నామని చెప్పారు.