భర్త చేసిన అప్పులు తీర్చేందుకు .. హైదరాబాద్ లో దొంగగా మారిన సాఫ్ట్ వేర్ భార్య

భర్త చేసిన అప్పులు తీర్చేందుకు .. హైదరాబాద్ లో దొంగగా మారిన సాఫ్ట్ వేర్ భార్య

హైదరాబాద్ లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. ఒంటిరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు.  ఈ మధ్య  మహిళలు కూడా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని భర్త కోసం చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఘటన సనత్ నగర్ లో  కలకలం రేపుతోంది. 

అసలేం జరిగిందంటే..వరంగల్ కు చెందిన అనితా రెడ్డి  బీటెక్ చేసి చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసింది. రెండేళ్ల కింద మేడ్చల్ కు చెందిన రాజేష్ తో  పెళ్లి జరిగింది.  వీరికి ఓ చిన్నారి పాప ఉంది. 

ALSO READ : గోపాల మిత్రల వేతన బకాయిలు విడుదల : ప్రభుత్వం

ఓ ఫైనాన్స్ సంస్థలో పనేచేసే భర్త  రాజేష్   కు తీవ్ర నష్టాలు వచ్చాయి.  అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో పదే పదే  భర్త పడే బాధను చూడలేక ఏదో ఒకటి చేయాలనుకున్న అనితా రెడ్డి  చివరకు దొంగగా మారింది . .దీంతో జనవరి 13న సాయంత్రం అవంతి నగర్ లోని తన ఇంటికి వెళ్లింది ఓ వృద్ధురాలు 

 ఆమెపై అంతస్థుకు వెళ్లేందుకు  లిఫ్ట్ ఎక్కింది . అయితే అప్పటికే లిఫ్ట్ లోకి వెళ్లిన అనితారెడ్డి  వృద్దురాలి మెడలో నుంచి మంగళ సూత్రం కొట్టేసి పారిపోయింది.  బాధితురాలి ఫిర్యాదుతో  సీసీ  కెమెరాల ఆధారంగా పోలీసులు అర గంటలోనే నిందితురాలు అనితారెడ్డిని పట్టుకున్నారు . భర్త చేసిన అప్పుల భారంతో ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసుల ముందు ఒప్పుకుంది. ఉన్నత చదువులు చదువుకుని..ఇలా దొంగతనాలు చేయడంపై చర్చనీయాంశంగా మారింది. 

ALSO READ : 30 నెలలుగా అద్దె ఇవ్వట్లేదని ఎంపీడీవో ఆఫీస్కు లాక్