30 నెలలుగా అద్దె ఇవ్వట్లేదని ఎంపీడీవో ఆఫీస్కు లాక్

30 నెలలుగా అద్దె ఇవ్వట్లేదని ఎంపీడీవో ఆఫీస్కు లాక్

తొర్రూరు(పెద్దవంగర), వెలుగు: అద్దె చెల్లించడం లేదని మహబూబాబాద్​ జిల్లా పెద్దవంగర ఎంపీడీవో ఆఫీస్​కు మంగళవారం బిల్డింగ్​ ఓనర్​ రాంపాక నారాయణ తాళం వేశాడు. దీంతో కొన్ని గంటల పాటు అధికారులు, ప్రజలు బయటే వేచి ఉండాల్సి వచ్చింది. పెద్దవంగర మండలంగా ఏర్పడినప్పటి నుంచి ఎంపీడీవో ఆఫీస్​ అద్దె భవనంలో కొనసాగుతోంది. 30 నెలల అద్దె రూ.2.10 లక్షలు, కరెంట్  బిల్లు బకాయి రూ.1.76 లక్షలు ఉందని ఓనర్​ తెలిపాడు. త్వరలో పెండింగ్​ కిరాయి చెల్లిస్తామని ఎంపీడీవో వేణు మాధవ్​ చెప్పడంతో శాంతించిన ఓనర్​ తాళం తీశాడు.