హైదరాబాద్, వెలుగు: పశుసంవర్ధక శాఖ ద్వారా అమలవుతున్న పథకాల్లో భాగంగా గ్రామీణ రైతులు, పశుపోషకులకు సేవలు అందిస్తున్న గోపాల మిత్రలకు ప్రభుత్వం వేతన బకాయిలను విడుదల చేసింది. తొమ్మిది నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలకు సంక్రాంతి పండుగ సందర్భంగా నిధులు రిలీజ్ చేసింది.
ఈ నిర్ణయం గ్రామీణ రైతాంగానికి, పశుపోషకులకు మరింత బలాన్నిచ్చే అంశంగా మారిందని, తమ సమస్యలపై త్వరితగతిన స్పందించి వేతనాల విడుదలకు కృషి చేసిన పశుసంవర్ధక శాఖ సెక్రటరీ డాక్టర్ ఇలంబర్తి, డైరెక్టర్ డాక్టర్ గోపి, సీఈవో డాక్టర్ మంజువాణి లకు రాష్ట్ర గోపాల మిత్ర సర్వీస్ అసోసియేషన్ నేతలు కృతజ్ఞతలు చెప్పారు. బకాయిల విడుదలతో ఆర్థిక ఇబ్బందులు తగ్గి, మరింత ఉత్సాహంగా సేవలు అందించే అవకాశం ఏర్పడిందని అసోసియేషన్ వర్గాలు పేర్కొన్నాయి.
