ఇంటర్ పాస్ అయినోళ్లకు ఎయిర్‌ మెన్ గ్రూప్ వై ఉద్యోగాలు

ఇంటర్ పాస్ అయినోళ్లకు ఎయిర్‌ మెన్ గ్రూప్ వై  ఉద్యోగాలు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) ఎయిర్‌మెన్ గ్రూప్ వై  పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఎలిజిబిలిటీ 

  • మెడికల్ అసిస్టెంట్ (నాన్ టెక్నికల్): గుర్తింపు పొందిన బోర్డు / సంస్థ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్​ సబ్జెక్టులుగా 10 + 2/ ఇంటర్మీడియట్/ సమాన అర్హత కలిగి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో నాన్ ఒకేషనల్ సబ్జెక్టులతో ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లిష్ సబ్జెక్టులో తప్పనిసరిగా 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 
  • మెడికల్ అసిస్టెంట్ (ఫార్మాసిస్ట్): గుర్తింపు పొందిన బోర్డు / సంస్థ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్​ సబ్జెక్టులుగా 10 + 2/ ఇంటర్మీడియట్/ సమాన అర్హత కలిగి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఫార్మసీలో డిప్లొమా/ బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి. ఫార్మసీ కౌన్సిల్ లేదా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. 
  • వయోపరిమితి:మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్: వివాహమై ఉండకూడదు. 17 నుంచి 21 ఏండ్ల మధ్యలో ఉండాలి. 

మెడికల్ అసిస్టెంట్ (ఫార్మాసిస్ట్)

  • అవివాహ అభ్యర్థులు: 2003,  జనవరి 01 నుంచి 2008, జనవరి 01 మధ్య జన్మించి ఉండాలి.
  • వివాహమైన అభ్యర్థులు: 2003, జనవరి 01 నుంచి 2006, జనవరి 01 మధ్య జన్మించి ఉండాలి. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • అప్లికేషన్ ప్రారంభం: జనవరి 12.
  • లాస్ట్ డేట్: ఫిబ్రవరి 01.
  • సెలెక్షన్ ప్రాసెస్: ఫేజ్-1లో ఆన్​లైన్ టెస్ట్, ఫేజ్-2లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్​నెస్ టెస్ట్ (పీఎఫ్ టీ-I & ఫీఎఫ్ టీ-II), అడాప్టబిలిటీ టెస్ట్- I (ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష), ఆడాప్టబిలిటీ టెస్ట్-II (ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • ఫేజ్-1 ఆన్ లైన్ ఎగ్జామ్ తేదీ: 2026 మార్చి 30, 31.
  • పూర్తి వివరాలకు iafrecruitment.edcil.co.in వెబ్​సైట్​ను సంప్రదించండి. 

​ఆన్​లైన్ టెస్ట్–1 ఆన్​లైన్ టెస్టులో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు.  సీబీఎస్ఈ 10+2  సిలబస్ ప్రకారం  రీజనింగ్ & జనరల్ అవేర్​నెస్ (ఆర్ఏజీఏ) నుంచి ప్రశ్నలు ఇస్తారు. 45 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.  ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.