నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు భాగంగా తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 23, 24 తేదీల్లో ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ సెక్రెటరీ ఎన్. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
నల్గొండ జిల్లాకు చెందిన జర్నలిస్టులు వారి పేర్లను ఈ నెల 20లోగా నల్గొండ జిల్లా పౌర సంబంధాల అధికారి వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు ,పేరు నమోదుకు నల్గొండ జిల్లా సమాచార , పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
