- ఎమ్మెల్సీ మల్లన్నకు వినతిపత్రం ఇచ్చిన నాగినేనిపల్లి సర్పంచ్
యాదగిరిగుట్ట, వెలుగు: బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఆ గ్రామ సర్పంచ్ బీరప్ప కోరారు. మంగళవారం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలతో హైదరాబాద్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి వినతిపత్రం అందజేశారు. కుషాయిగూడ, చెంగిచెర్ల ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు సమయానికి నడపాలని, నూతన బస్సుల సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
వెంటనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించి.. ఆయా డిపో మేనేజర్లకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా త్వరలో నాగినేనిపల్లిలో ఉన్న ప్రైమరీ స్కూల్ ను సందర్శించి తరగతి గదుల నిర్మాణానికి ఫండ్స్ రిలీజ్ చేస్తానని ఎమ్మెల్సీ మల్లన్న హామీ ఇచ్చినట్లు సర్పంచ్ బీరప్ప తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆంజనేయులు తదితరులు ఉన్నారు
