జ్యోతిష్యం : సంక్రాంతి రోజు సూర్య భగవానుడి ఆరాధన ఎందుకు..? ఎలాంటి ఫలితాలను ఇస్తుంది..!

జ్యోతిష్యం : సంక్రాంతి రోజు సూర్య భగవానుడి ఆరాధన ఎందుకు..? ఎలాంటి ఫలితాలను ఇస్తుంది..!

హిందువులు జరుపుకొనే  ప్రతి పండుగకు శాస్త్రీయత.. ఆధ్యాత్మికతో పాటు జ్యోతిష్యం ప్రకారం కొన్ని నియమాలు ఉంటాయి.  తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకొను పండుగల్లో మ సంక్రాంతి ఒకటి.  ఆ రోజున ( జనవరి 15)  సూర్యభగవానుడిని ఆరాధించి.. కొన్ని పరిహారాలు పాటిస్తే.. జాతకంలో సూర్యుని వలన కలిగే దోషం తొలగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  సూర్య దోషం నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . 

మకర సంక్రాంతి పండగ మాత్రమే గాక, సూర్యుడి ఆరాధనకు ఒక మంచి అవకాశమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సూర్య దోషం నుంచి ఉపశమనం పొందడానికి మకర సంక్రాంతినాడు ప్రత్యేక చర్యలు పాటించాలని ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు.  సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి గంగా లేదా పవిత్ర జలంతో స్నానం చేయాలి.   సూర్య భగవానుడిని పూజించాలి. ఆదిత్య హృదయం.. సూర్యాష్టకం పఠించాలి.  అవకాశం ఉంటే సూర్య నమస్కారాలు చేస్తూ.. సూర్యుడి ఎదురుగా నిలబడి.. దోసిళ్లలో నీరు పోసుకొని నీళ్లను వదలాలని పండితులు చెబుతున్నారు.

ALSO READ : వెలుగునిచ్చే పండుగ.. సంక్రాంతి పండుగ.. 

 మకర సంక్రాంతి పండగ  కాలానుగుణ మార్పుల పండగ మాత్రమే కాకుండా సూర్య భగవానుడిని పూజించి కష్టాలను దూరం చేసుకునే గొప్ప పండగ అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది (2026) సంక్రాంతి పండగ జనవరి 15 న వచ్చింది జరుపుకుంటున్నారు. 

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో జాతకంలో సూర్య దోషం ఉంటే.. ఒక వ్యక్తి జీవితంలో ఆరోగ్యం, సంబంధాలు, వృత్తికి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయని జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుస్తుంది.  ఇలాంటి దోషాల ఉపశమనం కోసం సంక్రాంతి రోజున ( 2026 జనవరి15)  సూర్య దేవుడిని ఆరాధించాలి.  అలాగే . సంక్రాంతి రోజున చేసే పరిహారాలు, పూజలు జీవితంలో స్థిరత్వం, ఆరోగ్యం, విజయానికి మార్గం సుగమం చేస్తాయనిచెబుతున్నారు.

ALSO READ : సంక్రాంతి స్పెషల్ 2026.. భోగి పళ్లు పోయడం..

ఎలా చేయాలంటే..

సూర్య దోషం నుంచి ఉపశమనం పొందడానికి మకర సంక్రాంతినాడు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి.. నిత్య పూజ అనంతరం.. సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడి... సంకల్పం చెప్పుకొని.. జాతక దోష పరిహారార్దం అని చెబుతూ..  రాగి పాత్రలో నీరు, ఎర్రటి పువ్వులు, తృణధాన్యాలు, బెల్లం ఉంచి సూర్యుడికి ప్రార్థించాలి. ఇలా చేసేటప్పుడు.. సూర్యాష్టకం.. ఆదిత్యహృదయం.. లేదా  సూర్య మంత్రం ..  గాయత్రీ మంత్రాన్ని పఠించాలి. 

ఆ రోజు ( 2026 జనవరి 15) పేదలకు వస్త్రదానం చేయాలి.  బ్రాహ్మణులకు స్వయంపాకం ఇచ్చి.. ఆశీర్వాదాన్ని తీసుకోవాలి.  దగ్గరలోని దేవాలయానికి వెళ్లాలి.  శివాలయంలో రుద్రాభిషేకం.. హనుమంతుని ఆలయంలో ఆకు పూజ జరిపించాలి.

ALSO READ : భోగిమంటలు ఎందుకు వేయాలి.. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఇదే..!

 దానధర్మాలతో పాటు , సేవ కూడా సూర్య దోషాన్ని తొలగిస్తుంది.  ఈరోజున నువ్వులు, బెల్లం, ధాన్యాలు, దుస్తులు, ఆహారాన్ని దానం చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.  

దానధర్మాలు పుణ్యాన్ని పెంచడమే కాకుండా జీవితంలో అడ్డంకులను తగ్గిస్తాయి. కష్టాల నుంచి రక్షిస్తాయని విశ్వసిస్తారు. సూర్య మంత్రాలను జపించడం.. జాతకంలో సూర్యుని దోష నివారణకు అత్యంత ప్రభావంతమైన నివారణగా చెప్పబడింది.

ఫలితం ఎలా ఉంటుంది..

ఇలా చేయడం వల్ల సూర్య దోషం తొలగిపోయి.. కెరీర్, గౌరవం, సంబంధాలు, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది.  మందిరంలో తామ్ర సూర్య విగ్రహం ఉంచి పూజ చేయడం ఫలప్రదమని పండితులు చెబుతున్నారు. దీంతో ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, జీవన స్థిరత్వం పెరుగుతాయి.

సూర్య దోషం నివారణను  ఎందుకు  చేయాలి..

సూర్య దోషం ఉంటే: ఆరోగ్యం దెబ్బతినడం, ఉద్యోగ సమస్యలు, కుటుంబ ఘర్షణలు, ఆత్మవిశ్వాసం లోపం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే, మకర సంక్రాంతి రోజు చేయబడే పూజలు, దానం, సూర్య ఆరాధనతో ఈ ప్రభావాలను తగ్గిస్తాయి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.