Bhogi Special 2026: భోగిమంటలు ఎందుకు వేయాలి.. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఇదే..!

 Bhogi Special 2026:  భోగిమంటలు ఎందుకు వేయాలి.. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఇదే..!

సంక్రాంతి పండుగ మూడు రోజుల ముచ్చట.. భోగితో మొదలైన సంక్రాంతి సెలబ్రేషన్స్​ కనుమతోముగుస్తాయి.  పట్టుపరికిణీలతో అమ్మాయిల హడావిడి అంతా కాదు..హిందువులు జరుపుకొనే ప్రతి పండుగ వెనుక ఎంతో కొంత సైంటిఫిక్​ రీజన్​ ఉంటుంది.  2026 జనవరి 14న  యువతరం ఏర్పాటు చేసే భోగి మంటల వెనుక .. సైంటిఫిక్​ రీజన్​ గురించి తెలుసుకుందాం. . .! 

సంక్రాంతి పండుగ భోగి మంటలతోనే మొదలవుతుంది. ఈ ఏడాది ( 2‌026) జనవరి 14 భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ    ముందురోజే పిల్లలందరూ మంటలో వేయడానికి కావాల్సిన దుంగలు, గడ్డి, పాత వస్తువుల... అన్నీ సిద్ధం చేసుకుంటారు. 

యువకులందరూ వీధుల్లో ఒక చోట చేరి పెద్ద ఎత్తున మంటలు వేస్తారు. మా మంట పెద్దది. మా మంట పెద్దది అని పోటీలు పడతారు. ఈ మంటలో పాత చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన చెక్కలు.. అన్నింటిని వేసి చలి కాగుతారు 

తెల్లవారి జామున మూడు గంటలకు మొదలైన ఈ భోగిమంటల సందడి ఆరు, ఏడు గంటల వరకు సాగుతుంది. మంట చుట్టూ చేరి, పిల్లలు, యువతీ యువకులు, పెద్దవాళ్లు సరదాగా మాట్లాడుకుంటారు. భోగిమంటలో మట్టి కుండలో నీళ్లు పోసి మంట మధ్యలో పెడతారు ఆనీళ్లు వేడి అయ్యాక వాటితో తలస్నానం చేస్తారు.

హేమంతరుతువులో చలి వల్ల అనేక క్రిములు, కీటకాలు పెరుగుతాయి. ఈ మంటల వేడి వల్ల ఆ క్రిములన్నీ నశించిపోతాయి. భోగి మంటను కర్పూరంతో వెలిగించడం ఆచారం. భోగిమంట కూడా హోమంలాంటిదేనని పెద్దలు అంటారు. భోగిమంటలో పేడతో  చేసిన పిడకలు వేస్తారు. అగాలికి చలికాలంలో వచ్చిన జబుబు. దగ్గు లాంటి రోగాలు తగ్గించే స్వభావం ఉంటుందని కూడా అంటారు. 

ఒకప్పుడు భోగిమంటలో రావి, మామిడి, మేడి చెట్ల బెరళ్ళను వేసే వాళ్లు అవి కాలినప్పుడు వచ్చే గాలి ఔషధంగా పనిచేస్తుందని చెప్తారు. ఇక పాత వస్తువులు కాలినట్లు, చెడు ఆలోచనలు వదిలేసి మంచిని ఆహ్వానించాలన్నదే భోగిమంట ఇచ్చే సందేశం .  అలాగే పాత వస్తువులపై మమకారం పెంచుకోకూడదన్నది ఈ భోగిమంటల్లోని అర్థం.

భోగి మంటలు

భోగిరోజు కేవలం మంటలు, ముగ్గులు మాత్రమే కాను. ఇళ్లలో ప్రత్యేక వంటలు కూడా చేస్తారు. శరీరంలో ఉన్న చల్లదనం పోవాలని భోగిరోజు నువ్వుల నూనెతో నలుగు పెట్టుకుని తలస్నానం చేస్తారు. దాంతో అప్పటివరకు చలి వలన వచ్చిన జలుబు, గొంతు సంబంధమైన చిన్నచిన్న రోగాలు పోతాయి... 

శరీరం వేడితో నూతన ఉత్తేజాన్ని పొందుతుంది. ఈ పండుగ వాటికి రైతులకు పంట ఇంటికి చేరుతుంది. కాబట్టి, కొత్తబియ్యం, పెసరపప్పు. నెయ్యి, మిరియాలు కలిసి పులగం వండుతారు. ఇంటికొచ్చిన బంధువులందరికీ దీనిని పెడతారు.. దీనిలో పోషకాలతోపాటు చలికాలంలో జీర్ణవ్యవస్థను బాగుచేసే శక్తి కూడా ఉంటుంది. 

ప్రకృతిని కాపాడుదాం 

భోగిరోజు వేసే మంటల వల్ల పర్యావరణానికి హాని కలగకూడదు. ప్రకృతికి మేలు జరగాలి.  కేవలం దుంగలు, కర్రలు, పేడతో చేసిన పిడకలుతో మాత్రమే భోగి మంటలు వేయాలి.   కాని భోగిమంట వేయాలనే ఉద్దేశంతో పాత టైర్లు, ఇంట్లో దండగగా ఉన్న ప్లాస్టిక్, రబ్బరు వస్తువులు తగలబెడుతున్నారు. దాంతో వాటి నుంచి వచ్చే విషవాయువులు గాల్లో కలుస్తున్నాయి. గాలి కాలుష్యమై రోగాలు రావడానికి కారణమవుతుంది. అలాగే పెట్రోలు, కిరోసిన్ వంటి వాటిని కూడా మంటలు వేయడానికి వాడకూడదు. సంతోషంగా జరుపుకునే సంక్రాంతి వల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ల ఆరోగ్యం చెడిపోకుండా ఉండాలంటే భోగి మంటలు వేసేటప్పుడు ఇవన్నీ తప్పక గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే ప్రకృతికి, మనిషికి మంచిది. అదే నిజమైన భోగి పండుగ సందేశం.