సంక్రాంతిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు.ఈ ఏడాది సంక్రాంతి పండుగ జనవరి 14న భోగితో ప్రారంభమవుతుంది. భోగి రోజున ఉదయాన్నే భోగి మంటలు వేస్తారు. సాయంత్రం పేరంటం నిర్వహించి.. చిన్నారులకు భోగి పండ్లు కూడా వేయడం ఆనవాయితిగా పాటిస్తు వస్తున్నారు. చిన్న పిల్లలకు భోగి పండ్లను ఎందుకుపోయాలి.. పండితులు ఏం చెబుతున్నారు.దీని వెనుక సంప్రదాయ ఆచార వ్యవహారాలను ఇప్పుడు తెలుసుకుందాం. . .!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ మొదలైంది. మూడు రోజుల పాటు సంక్రాంతిని జరుపుకుంటాం. ఈ ఏడాది ( 2026) జనవరి 14,15,16 మూడు తేదీల్లో సంక్రాంతిని జరుపుకుంటాం. అనాదీగా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తు వస్తున్నారు.
భోగి పండుగరోజు ఇంట్లో చిన్న పిల్లల నెత్తిమీద భోగిపండ్లు పోయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. భోగిపండ్లు అంటే రేగుపండ్లు. భోగి రోజు సాయంత్రం ఇంట్లో ముత్తెదువులు రేగుపండ్లు, చెరుకు ముక్కలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు కలిపి పిల్లలను కూర్చోపట్టి నెత్తిన పోస్తారు.
పురాణాల ప్రకారం భోగి (రేగు) పండ్లను శ్రీమన్నారాయణుడి స్వరూరంగా భావిస్తారు. భోగి పండ్లను చిన్న పిల్లల మీద పొస్తే శ్రీమహావిష్ణువు ఆశీర్వాదంలో బాలారిష్టాలతో పాటు, ఇతర అన్నిదోషాలు పోతాయని పండితులు చెబుతున్నారు. సంక్రాంతి అంటే సూర్యుడికి సంబంధించిన పండుగ .. రేగుపండ్లు ఎరుపురంగులో, గుండ్రంగా ఉంటాయి. అందువల్ల విష్ణుమూర్తి, సూర్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని నమ్ముతారు. అందుకే పిల్లల నెత్తి మీద భోగి పండ్లను పోసే ఆచారాన్ని ... సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు.
►ALSO READ | Bhogi Special 2026: భోగిమంటలు ఎందుకు వేయాలి.. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఇదే..!
పండితులు తెలిపిన వివరాల ప్రకారం శివుడికోసం నరనారాయణుల బదరికావనంలో తపస్సు చేస్తారు. అప్పుడు దేవతలు వాళ్ల తపస్సుకు మెచ్చి, నరనారాయణులు తలలపై బదరీ ఫలాలు కురిపించారని ... అందుకే ఈ కార్యక్రమం పురాణకాలం నుంచి వస్తున్న ఆచారంగా చెబుతున్నారు.
యవ్వనదశలోకి అడుగుపెట్టే పిల్లలకు మాత్రమే తల మీద బయటకు కనపడని బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ పండ్లను పోయడం వల్ల అది ప్రేరేపించబడిచిన్నారులు జ్ఞానవంతులుగా మారతాడని పెద్దలు నమ్ముతారు. అందుకే 12 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులకు మాత్రమే భోగమండ్లు పోస్తారు. అలాగే పిల్లలకు దిష్టి ఉంటే తొలగి పోతుందని కూడా చెప్తారు. సైన్స్ ప్రకారం భోగిపండ్లలో విద్యుచ్ఛక్తి ఉంటుంది. చలికాలంలో పిల్లల నెత్తిమీద ఇవి పోయడం వల్ల శరీరంలోని చల్లదనం పోయి... పిల్లలు పూర్తి ఆరోగ్యంగా తయారవుతారు.
ఇంట్లో ఉండే విశాలమైన గదిలో దేవుడి పటాలు వరుస క్రమంలో అమర్చి. .. వాటి ఎదురుగా చిన్నారులను కూర్చోపెట్టి ముత్తైదువలతో బొట్టు పెట్టించి .. హారతి ఇచ్చిన తరువాత పెద్దవారి నుంచి వరసుగా పాటలు పాడుతూ భోగి పండ్లను పోస్తారు.
భోగి పండ్లను పోసేటప్పుడు దానిలో ఎలాంటి ఇతర తినుబండారాలు వేయకూడదు. భోగి పండ్లను పోసిన తర్వాత కింద పడ్డవాటిని చిన్నారులకు మాత్రమే ఇవ్వాలి. తిరిగి మనం తీసుకొకూడదు. ఇంటికి వచ్చిన చిన్నారులను దైవం స్వరూపంగా భావించాలని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ ఇంట్లో ఉండే చిన్నారులను భోగి పండ్లతో ముంచెత్తి.. ఆనందాల మధ్య జరుపుకొని .. లక్ష్మీనారాయణుల ఆశీస్సులను అందజేద్దాం. . .!
