‘మహబూబాబాద్’ సమగ్రాభివృద్ధికి కృషి : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

‘మహబూబాబాద్’ సమగ్రాభివృద్ధికి కృషి : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​ పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో విస్తృతంగా పర్యటించి, వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 

పట్టణంలో ఇల్లందు రోడ్డులోని 17 వార్డులో రూ.55 లక్షలతో సీసీ రోడ్లు. డ్రైనేజ్ కాల్వలు, పైపు లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 6వ వార్డులో రూ.50 లక్షలతో బేతోలు పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు పనులకు, రూ.7 కోట్లతో బంధం చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

 19వ వార్డులో రూ.64 లక్షలతో అభివృద్ధి పనులు, 33వ వార్డులోని తహసీల్దార్​ ఆఫీస్​ వద్ద రూ.40 లక్షలతో అంతర్గత డ్రైనేజీలు, 23వ వార్డులో రూ.59 లక్షలతో మూడు కోట్ల జంక్షన్ పరిధిలో అంతర్గత రోడ్లు, సీసీ డ్రైన్స్, 11వ వార్డులో రూ.12 కోట్లతో నందన గార్డెన్ రోడ్డు హస్తినాపురం కాలనీ అభివృద్ధి వరద ముంపు నివారణకు డ్రైన్స్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. 

17వ వార్డులో రూ.50 లక్షలతో ఇల్లందు రోడ్డు జ్యోతిరావు పూలే జంక్షన్ ప్రాంతం అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, 32, 18 వ వార్డుల్లో రూ.కోటితో బొడ్రాయి సెంటర్ ప్రాంతం అభివృద్ధి పనులు, 13, 14వ వార్డుల్లో రూ.కోటితో మోర్ సూపర్ మార్కెట్ బస్టాండ్ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, శిలాఫలకాలను ప్రారంభించారు. మహబూబాబాద్​ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్, ఎంపీ పోరిక బలరాంనాయక్, జిల్లా ఇన్​చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పాల్గొన్నారు.