V6 News

అక్రమంగా మట్టి తరలిస్తున్న జేసీబీ, 8 ట్రాక్టర్లు పట్టివేత

అక్రమంగా మట్టి తరలిస్తున్న జేసీబీ, 8 ట్రాక్టర్లు పట్టివేత

కూసుమంచి, వెలుగు: అక్రమంగా మట్టి తరలిస్తున్న ఒక జేసీబీ, ఎనిమిది ట్రాక్టర్లను రెవెన్యూ, పోలీసులు  పట్టుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. తహసీల్దార్ డి. సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కూసుమంచి మండలం గురువాయిగూడెం కుంట చెరువు నుంచి అక్రమంగా మట్టి తవ్వుతున్నట్టు సమాచారం అందింది. దీంతో రెవెన్యూ , పోలీసులు సిబ్బంది అక్కడి వెళ్లారు. అక్కడ ఉన్న జేసీబీనీ, 8 టాక్టర్లను సీజ్​ చేవారు.  అనంతరం పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై నాగరాజు వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.