
సి.బి.ఐ. మాజీ జాయింట్ డైరెక్టర్ వి.లక్ష్మీనారాయణ ఆదివారం ఉదయం 10గం.30ని. జనసేన పార్టీలో చేరనున్నారు. శనివారం రాత్రి ఒంటి గంటకు విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయానికి లక్ష్మీనారాయణ వెళ్లి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. సుమారు గంట 45 నిమిషాలపాటు వీరిరువురూ మాట్లాడుకున్నారు. సమావేశం అనంతరం జనసేన లో చేరనున్నట్లు లక్ష్మీనారాయణ ప్రకటించారు. అంతకు ముందు వరకు.. లక్ష్మీనారాయణ టీడీపీ లో చేరుతారన్న ఊహాగానాలకు తెరపడింది.
లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఆయన చేరిక తరువాత ప్రకటించనున్నారు పవన్ కల్యాణ్. లక్ష్మీనారాయణతోపాటు ఆయన తోడల్లుడు, విద్యావేత్త శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి శ్రీ రాజగోపాల్ కూడా జనసేనలో చేరనున్నారు.
Ex CBI JD Lakshmi Narayana meeting with JanaSena Chief @PawanKalyan pic.twitter.com/UVlEsYBWJd
— JanaSena Party (@JanaSenaParty) March 16, 2019